కరీంనగర్ టౌన్, వెలుగు: నీట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యద్భుత మార్కులతో అఖండ విజయం సాధించారని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక అల్ఫోర్స్ సెంట్రల్ ఆఫీస్లో ఉత్తమ మార్కులు సాధించిన స్టూడెంట్లను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్స్ పీరియన్డ్స్ లెక్చరర్ల టీచింగ్, పర్యవేక్షణ, విద్యార్థుల కృషి వల్లే అల్ఫోర్స్కు మంచి ఫలితాలు సొంతమయ్యాయన్నారు.
ఎన్.హేమంత్ 691, వి.హాసిని 671, డి.పూజిత 650, ఎన్.కౌశిక్ రెడ్డి 647, పి.అక్షర రెడ్డి 639, వి.శ్రీముఖి 619, మరియాసభ 619, ఏ.శ్రీవర్థిని 613, ఎం.కమాలికా ప్రీతి 613, ఎన్.జ్ఞానద 604, ఏ.అమరేందర్ 598, బి.హాసిత 595 మార్కులు సాధించినట్లు వివరించారు. అదేవిధంగా కె.సుహృదాఘవ పీడబ్లూడీ కేటగిరీలో జాతీయస్థాయిలో 675 వ ర్యాంకు సాధించాడని వెల్లడించారు. 10 మంది విద్యార్థులు 600పైన మార్కులు సాధించడం గొప్ప విషయమన్నారు. 130 మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు అందించిన ఏకైక కాలేజీ అల్ఫోర్స్ అని తెలిపారు.